అంతర్జాతీయ చిత్రోత్సవం వాయిదా

గోవాలో నవంబర్‌ 20 నుంచి 28 వరకు జరగాల్సిన అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు. ఈ 51వ చలనచిత్రోత్సవ సంబరాలు వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 వరకూ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ఈసారి హైబ్రిడ్‌ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఐబీ మంత్రిత్వశాఖ సూచనల మేరకు.. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సమయంలో సినిమాలను అఫిషియల్‌ డిజిటల్‌ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేస్తారు. డైరక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, గోవా ఎంటర్‌టైన్మెంట్‌ సొసైటీ సంయుక్తంగా ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాయి.