అందుకు గర్వపడుతున్నాను -రాహుల్ గాంధీ

నిజమైన దేశభక్తుడికి కుమారుడిగా జన్మించినందుకు గర్విస్తున్నానని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ అన్నారు. నేడు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా రాహుల్‌ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు రాహుల్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘నిజమైన దేశభక్తుడు, ఉదారవాది, పరోపకారి అయిన తండ్రికి కొడుకు అయినందుకు గర్విస్తున్నాను. ప్రధాన మంత్రిగా రాజీవ్‌ గారు దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపించారు. తన దూరదృష్టితో దేశాన్ని శక్తివంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా.. అప్యాయతతో, కృతజ్ఞతతో ఆయనకు నమస్కరిస్తున్నాను’ అని పేర్కొన్నారు.