రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు యావత్ భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోంది.గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయన దేశ ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉంటారని’ పేర్కొన్నారు.

అంబేద్కర్‌కు ఏపీ గవర్నర్ ఘన నివాళి