అగ్రిగోల్డ్‌ బాధితులకు మరో 200 కోట్లు

అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకోవడం.. పోలీసుల సంక్షేమం.. మహిళల రక్షణకు బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర హోం శాఖకు రూ.5,988.72 కోట్లు కేటాయించగా.. న్యాయ శాఖకు 913.76 కోట్లు కేటాయించింది. పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్‌ బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మరో రూ.200 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.264 కోట్లు కేటాయించగా.. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన బాధితులకు సొమ్ము చెల్లించారు.