అతి పెద్ద తెరపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీమియర్‌ షో

ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమా విడుదలకు  అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది చిత్రం.  యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారిగా హీరోలుగా అభిమానుల్ని అలరించబోతున్నారు. ఆలియా భట్, ఓలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా పలువురు బ్రిటీష్ నటీనటులు ఈ సినిమాతో మెప్పించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను మళ్ళీ మొదలు పెట్టింది రాజమౌళి అండ్ టీమ్. త్వరలోనే ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో భారీ ఎత్తున జరుపబోతున్నారు.