అతి పెద్ద రూమర్‌ ఇదే.. రేణూ దేశాయ్‌

కరోనా సంక్షోభం సమయంలో.. టాలీవుడ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వార్త అప్‌లోడ్‌ అవుతోంది. వీటిలో అధిక భాగం ఫేక్‌ న్యూస్‌లే ఉంటున్నాయి. ఇటీవల వైరల్‌ అయిన మరో ఫేక్‌ న్యూస్‌ రేణూ దేశాయ్‌ మహేష్‌ నిర్మాణంలో నిర్మించే చిత్రంలో నటించేందుకు అంగీకరించారనే వార్త. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్‌ అయిన మేజర్‌లో అడవి శేష్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్‌బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్రలో నటించేందుకు రేణూ దేశాయ్‌ సంతకం చేశారనే వార్త షికార్లు చేస్తోంది. దీనీపై నటి రేణూ దేశాయ్‌ స్పందించారు. తాను నటించేందుకు సిద్ధమేనని, అయితే ప్రస్తుతం తాను ఏ సినిమాకు సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్‌ అని, ఇలాంటి రూమర్స్‌ను రాసేవారికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నానని అన్నారు.