అమిత్‌షాను కలిసిన యుపి మంత్రి అజయ్ మిశ్రా

యుపి హోంశాఖ సహాయక మంత్రి  అజయ్  మిశ్రా బుధవారం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాలో రైతులను కారుతో తొక్కించిన ఘటనలో రైతులు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.  అజయ్  మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్య కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు యుపి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోలేదు. రైతులను తొక్కించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తన కుమారుడు ఆ ప్రాంతంలో లేడంటూ  అజయ్ మిశ్రా బుకాయిస్తున్నారు.