అమిర్‌ఖాన్‌కు కరోనా

బాలీవుడు స్టార్‌ అమిర్‌ఖాన్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయనకు కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణయింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం విధితమే. ఇటీవలే పలువురు బాలీవుడు నటులు ఆశిష్‌ విద్యార్థి, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, దర్శకుడు సంజరులీలా భన్సాలిలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం అమిర్‌ఖాన్‌ హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. తన సిబ్బంది కూడా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు