అరుదైన ఘనత ఆమెదే.. హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ ఆమె ఖాతాలోనే..!

సాయిపల్లవి హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ను సాధించి అరుదైన రికార్డును సాధించారు. అశేష అభిమానుల్లో తమదైన ప్రత్యేక ముద్రను పొందడానికి కథానాయికలు పడే పాట్లు ఇన్నీఅన్నీ కావు. ఈ విషయంలో వాళ్లు ఏళ్లతరబడి నానాతంటాలు పడుతూనే ఉంటారు. కొన్ని సార్లు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించినప్పటికీ వారికంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడం కష్టం. కానీ … నేచురల్‌ నటి సాయిపల్లవి మాత్రం చాలా సులభంగా తనదైన శైలిలో ప్రత్యేకతను సంతరించుకున్నారు.