అల్లరి నరేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపిన నాని
అల్లరి నరేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపిన నాని

అల్లరి నరేశ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపిన నాని

తెరంగేట్రం చేసిన తొలి చిత్రం పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న కామెడీ హీరో అల్లరి నరేశ్‌. ఓ వైపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ పలు విభిన్న చిత్రాల చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పూర్తిగా తన పంథా మార్చుకొని పలు సీరియర్‌ క్యారెక్టర్స్‌ ట్రై చేస్తున్నాడు. ఇలా ప్రయోగాత్మకంగా చేసింది ‘నాంది’. ఈరోజు నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. అతడి తాజా చిత్రాలు నాంది, బంగారు బుల్లోడు చిత్రాల టీజర్లు విడుదల అయ్యాయి.ముఖ్యంగా నరేశ్‌ స్నేహితుడు నేచరల్‌ స్టార్‌ నాని చేసిన ట్వీట్‌ కొత్తగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. నాంది సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నా’ అంటూ నాని ట్వీట్‌ చేశాడు. నానితో పాటు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దగ్గుబాటి రానా, దర్శకుడు హరీష్‌ శంకర్‌, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.