అవమానాలు తట్టుకోలేకే టిడిపికి రాజీనామా: దివ్యవాణి

పార్టీలో అవమానాలు తట్టుకోలేకే టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి దివ్యవాణి ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో తనను అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని చెప్పారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. కనీసం ప్రెస్‌మీట్లు పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదన్నారు. టిడిపి అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలను దివ్యవాణి ఖండించారు. అవసరమైతే నేరుగా చంద్రబాబుకు రాజీనామా లేఖ అందిస్తానని తెలిపారు.