ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసే ఆసుపత్రులకు రూ.234 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డులతో వైద్యం చేసిన ఆసుపత్రులకు నిధులు విడుదల చేశామన్నారు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కింద వైద్యం చేసిన ఆసుపత్రులకు రూ.127 కోట్లు విడుదల చేశామన్నారు.

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు నిధులు విడుదల