దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ . ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం.
