కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్రం ప్రకటించిన రూ 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. సరైన దిశలో వేసిన తొలి అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్డౌన్ విధించిన క్రమంలో మన రైతన్నలు, దినసరి కార్మికులు, మహిళలు, వృద్ధులకు అండగా నిలవాల్సిన సమయం ఇదని, ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ సరైన దిశలో తీసుకున్న తొలి చర్య అని రాహుల్ గురువారం ట్వీట్ చేశారు.

ఆర్థిక ప్యాకేజ్‌పై స్పందించిన రాహుల్