ఆర్బీఐ పై ప్రశంసలు కురిపించిన చిదంబరం
ఆర్బీఐ పై ప్రశంసలు కురిపించిన చిదంబరం

ఆర్బీఐ పై ప్రశంసలు కురిపించిన చిదంబరం

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయంపై సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబ‌రం స్పందించారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కార‌ణంగా దెబ్బ‌తిన్న మ్యూచువ‌ల్ ఫండ్స్ ప‌రిశ్ర‌మ‌కు ద్ర‌వ్య లభ్య‌త కోసం సోమవారం రిజ‌ర్వు బ్యాంకు రూ.50,000 కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించ‌టాన్ని ఆయన స్వాగతించారు. ఆర్‌బీఐ సత్వర చర్య మ్యూచువ‌ల్ ఫండ్స్ విభాగంలో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌కు ఊరటనిస్తుందని ఆయ‌న ప్రశంసించారు.