ఆర్‌ఆర్‌ఆర్‌లో కీలకపాత్రలో శ్రియా

మొన్నటి వరకు హీరోయిన్‌గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తున్న శ్రియా ఆర్‌ఆర్‌ఆర్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ప్రకటించకముందే శ్రియానే బహిర్గతం చేసింది. ఫ్యాన్స్‌తో సోషల్‌మీడియాతో మాట్లాడిన శ్రియా ఈ కొత్త విషయాన్ని వెల్లడించింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో అజరుదేవ్‌గణ్‌కు జోడిగా నటించబోతున్నానని తెలిపింది. సినిమాలో చాలా కీలకంగా ఉండే ఈ భాగం ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కింద వస్తుందని, అందులో తాను నటించానని తెలిపింది. ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించేందుకు శ్రియా నిరాకరించింది. అప్పట్లో రాజమౌళి డైరెక్షన్‌లో ఛత్రిపతిలో నటించిన శ్రియా 15 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన డైరెక్షన్‌లో పనిచేస్తోంది. ప్రస్తుతం శ్రియా స్పెయిన్‌లోని బార్సిలోనాలో తన రష్యన్‌ భర్త అండ్రితో కలిసి ఉంటోంది.