ఆర్‌ఆర్‌ఆర్‌ ఉగాది పోస్టర్‌ విడుదల

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మల్టీస్టారర్‌.. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సినీ అభిమానులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఉగాది పండుగ సందర్భంగా.. ఈ చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీర్‌ ఇద్దరూ.. సంబరాల్లో మునిగితేలుతూ.. కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.