ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి మరో పోస్టర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుండి మరో పోస్టర్‌ విడుదలైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా నుండి మరో పోస్టర్‌ ను ఆర్‌ఆర్‌ఆర్‌ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్‌ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్‌ ఉంది. ఇప్పటికే రామ్‌చరణ్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం కొమరం భీమ్‌గా ఎన్‌టిఆర్‌కు సంబంధించిన టీజర్‌ ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఎన్‌టిఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమోళి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.