ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి

కరోనామహమ్మారి ఢిల్లీ ప్రభుత్వాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్  నిన్న(సోమవారం) రాత్రి రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. అధిక జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కోవిడ్-19పరీక్ష చేసిన వైద్యుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని  జైన్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత రాత్రి  హై గ్రేడ్ జ్వరం, ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవటంతో ఆసుపత్రిలో చేరానని ఆయన ట్వీట్ చేశారు