ఆ ఘనత జగన్ కే సొంతం
ఆ ఘనత జగన్ కే సొంతం

ఆ ఘనత జగన్ కే సొంతం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తొమ్మిది నెలలకే 90 శాతం హామీలు నెరివేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. హంద్రీనీవా ద్వారా కుప్పం కు నీరందిస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు.