ఆ వ్యాపారవేత్తతో కాజల్‌ పెళ్లి..!

రానా, నిహారిక, నిఖిల్‌ లాగానే ప్రముఖ టాలీవుడ్‌ తార కాజల్‌ అగర్వాల్‌ కూడా పెళ్లి చేసుకోబోతోంది. ఇన్నాళ్లూ కాజల్‌పై లవ్‌ ఎఫైర్ల విషయంలో పెద్దగా పుకార్లు రాలేదు. కానీ ఇటీవల కాలంలో ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలచ్చాయి. తన బారుఫ్రెండ్‌తో కలిసి ఇతర స్నేహితులను కలుపుకొని విహార యాత్రకు వెళ్లచ్చింది. ఆ బారుఫ్రెండ్స్‌తో పార్టీలు, పబ్బులకు కూడా వెళ్తోంది. అతని కుటుంబానికి, కాజల్‌ కుటుంబానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆయన మంబయిలోని ఓ బిజినెస్‌ మ్యాన్‌. ఇరు కుటుంబాల్లోనూ వీరి పెళ్లికి అంగీకారం తెలిపారు. ప్రస్తుతం కాజల్‌ చేతిలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఉన్నాయి. వీటి షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి పెళ్లి చేసుకోవాలనేది కాజల్‌ ఆలోచన. పెళ్లి తర్వాత సినిమా నిర్మాణం రంగంలోకి అడుగు పెట్టాలని కాజల్‌ భావిస్తోందట.