ఆ స్టార్‌ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నా: మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇటీవల మంచు లక్ష్మీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఓ స్టార్‌ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అయితే తనకు పెళ్లి అవుతున్నప్పుడు చాలా బాధడ్డానని చెప్పుకొచ్చింది. ఆ హీరోకి పెళ్లి అవుతుంటే చాలా ఏడ్చేసిందట! మరి మంచు లక్ష్మీని ఇంతలా ఏడ్చించిన ఆ స్టార్‌ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఈ అమ్మడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌పై మనసు పారేసుకుందట! తనను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుందట! అయితే అమిర్‌ ఖాన్‌కు పెళ్లి అయ్యేటప్పుడు బాగా ఏడ్చిందట. అంతేకాదు అతను రెండో సారి పెళ్లిచేసుకునేటప్పుడు కూడా ఏడ్చానని చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌ ఎంత ఇష్టమో.. టాలీవుడ్‌లో నాగార్జున అంటే కూడా అంతే ఇష్టమని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.