ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు
ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు

ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) మంగళవారం కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలిసిందే.