ఇటలీలో ‘థ్యాంక్యూ’కి బ్రేక్‌

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘థాంక్యూ’. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దాదాపు తెలుగు సినిమాల షూటింగ్‌ నిలిపివేశారు. కానీ నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా మాత్రం షూటింగ్‌ జరుపుకునేందుకు టీం మొత్తం గత నెలలో ఇటలీ వెళ్లారు. కానీ ఇప్పుడు కరోనా పరిస్థితులు చూసి షూటింగ్‌ని నిలిపివేసినట్లు చిత్రబృందం తెలిపింది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. రాశీఖన్నా ఒక హీరోయిన్‌గా నటిస్తోంది.