బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్ను మూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. అయితే తిరిగి అనారోగ్యానికి గురవడంతో ఈ సినిమా ప్రమోషన్లకు ఇర్ఫాన్ దూరంగా ఉన్నారు. మంగళవారం ఇర్ఫాన్ అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.

ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత