ఇసెట్‌కు 85.84 శాతం హాజరు

ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఇసెట్‌)కు 85.84 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 36,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 31,891 మంది విద్యార్థులు సోమవారం పరీక్ష రాసినట్లు ఎపి ఉన్నత విద్యామండలి సెట్ల కన్వీనరు ఎం.సుధీర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 72 పరీక్షా కేంద్రాలను, హైదరాబాద్‌లో 3 కేంద్రాలను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, బిఎస్‌సి మేథమెటిక్స్‌ సిరామిక్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సిఎస్‌ఇ, ఇఇఇ విద్యార్థులకు పరీక్ష జరిగింది. రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఇసిఇ, ఇఐఇ, మెకానికల్‌, మెటలార్జికల్‌ అభ్యర్థులకు పరీక్ష జరిగింది.