ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) నిర్ణయించింది. మొత్తం 13 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా టిడిపి సభ్యులు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై సిఎం జగన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘ గవర్నర్‌ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు ‘ వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదని సిఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ముఖ్యమంత్రి జగన్‌ టిడిపి నేత అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. మరోవైపు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సోమవారం ప్రారంభమయింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కేబినెట్‌ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు సిఎంవైఎస్‌ జగన్‌, మంత్రులు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు.