ప్రజా వేదిక కూల్చి ఏడాది అయిన సందర్భంగా ఆ ప్రాంతాఁ్న పరిశీలించేందుకఁ టిడిపి నేతల ప్రయత్నించడం ఉద్రిక్తతలకఁ దారి తీసింది. టిడిపి నేతలు దేవినేఁ ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టి.శ్రావన్‌కఁమార్, నక్కా ఆనందబాబు తదిరతులు ప్రజా వేదిక వద్దకఁ బయల్దేరారు. అయితే వీరి రాకను గమఁంచిన పోలీసులు ఉండవల్లి వద్దే అడ్డుకఁన్నారు. మొత్తం నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడి వారిఁ అక్కడే ఆపేశారు. టిడిపి నేతల వరకఁ ఆపేసి సామాన్య ప్రజలను వదిలేశారు. అడ్డుకఁన్నప్పటికీ టిడిపి నేతలు ముందుకఁ వెళ్లేందుకఁ ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఉండవల్లి వద్ద టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టిడిపి నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారఁ వర్ల రామయ్య మండిపడ్డారు. అరెస్ట్ చేసిన టిడిపి నేతలను మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కఁ తరలించారు
