ఉగాదికి ఓటీటీలో ‘రాధేశ్యామ్‌

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ నెల 11న థియేటర్లలో విడుదలైంది. త్వరలోనే ఓటిటీలోకి విడుదల కానుంది. ఓటిటీ అమెజాన్‌ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 2న ఉగాది కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌ కావొచ్చని భావిస్తున్నారు.