ఉగాదికి ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్ లుక్‌
ఉగాదికి ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్ లుక్‌

ఉగాదికి ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్ లుక్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ యూర‌ప్‌లో జ‌రుగుతుంది. తాజా స‌మాచారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా ఓ ఛేజింగ్ స‌న్నివేశాన్ని పూర్తి చేసిన‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.