ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న కల్యాణ్ రామ్

ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న కల్యాణ్ రామ్

ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా కల్యాణ్ రామ్ ముందుకు సాగుతున్నాడు. గతంలో ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కించిన జై లవ కుశ భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి కల్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ కోసం మంచి కథను తయారు చేయించే పనిలో కల్యాణ్ రామ్ వున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ను పూర్తి చేసేలోగా విభిన్నమైన కథను సిద్ధం చేయించి, ఎన్టీఆర్ ను ఒప్పించాలనే ఉద్దేశంతో కల్యాణ్ రామ్ చకచకా పనులను కానిచ్చేస్తున్నాడట. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి.