ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ నటి !

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్‌ తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అయితే ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటించనున్నది. ఒక ఇంటర్వ్యూ లో దీపికా మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్‌ తో నటించే అవకాశం కోసం వచ్చిందని, చాలా రోజులగా ఆయన పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. ఆయన నటన అంటే తనకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఇక కొరటాల ఆఫర్‌ రాగానే వెంటనే దీపికా ఓకే చేసినట్లు సమాచారం.