ఎన్టీయార్‌ మూవీలో రూ.250 కోట్లతో ఇండో-పాక్‌ యుద్దం సెట్‌

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్‌ మూవీఁ డివివి దానయ్య దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు . మేజర్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. కానీ పలు కీలక సన్నీవేశాలు, అలియా భట్‌, రామ్‌చరణ్‌ల కీలక ఘట్టాలు, ఎన్టీఆర్‌కఁ సంబంధించిన సీన్స్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కఁ సంబంధించిన సన్నీవేశాలు చిత్రీకరణ బ్యాలెన్స్‌గా ఉందట. త్వరలోనే ఈ సన్నీవేశాలుకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత త్రివిక్రమ్‌ సినిమా తో పాటు ‘కెజిఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వలో ఎన్టీఆర్‌ ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారంటూ వరుస కథనాలు విఁపిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇండో-పాక్‌ విడిపోవడం, ఆ తరువాత యుద్ధం వంటి కీలక అంశాల నేపథ్యంలో ఈ చిత్ర నేపథ్యాఁ్న సెట్‌ చేసినట్టు వార్తలు విఁపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ సెట్‌ కోసం మైత్రీ సంస్థ ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..