ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌
ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్‌ భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇచ్చారు. సుమారు గంటకుపైగా సాగిన వీరిభేటీలో.. ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్‌ కుమార్‌ నుంచి గవర్నర్‌ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని ఈసీకి తెలిపినట్లు సమాచారం. అయితే గవర్నర్‌తో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించడానికి ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ నిరాకరించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రెస్‌నోట్‌ ద్వారా విడుదల చేస్తానని తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం రమేష్‌ కుమార్‌ ఎన్నికల సంఘం కార్యదర్శి, ఐజీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.