ఎపిలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. 23 నుంచి 25 వరకు మెడిసిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 118 సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 2,72,900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్‌ ధరించిన విద్యార్థలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. భౌతికదూరం పాటిస్తూ శానిటైజేషన్‌, ప్రాథమిక పరీక్షల అనంతరం విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తున్నారు.