ఎపిలో కొత్తగా 10,601 కేసులు, 73 మరణాలు నమోదు!

ఎపిలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజూ పదివేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,601 కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,17,094కు చేరుకుంది. ఇవాళ 73 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 4,560కి చేరుకుంది. ప్రస్తుతం 96,769 మంది కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 4,15,765 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 70,993 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 42,37,070 కరోనా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.