ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ కరోనాతో మృతి

ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ 10 రోజులుగా కరోనాతో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. పోలీస్‌ శాఖలో సమర్థవంతమైన అధికారిగా రాంప్రసాద్‌కు మంచి పేరు ఉంది. గతంలో విజయవాడ ట్రాఫిక్‌ ఎడిసిపి గా విధులను నిర్వర్తించారు. ప్రస్తుతం కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌లో నాన్‌ కేడర్‌ ఎస్‌పి గా ఉన్నారు.