ఎపి లో కర్ఫ్యూ

ఎపి లో ఎల్లుండి నుండి పాక్షిక కర్ఫ్యూ అమలుకానుంది. కరోనా నియంత్రణకుగాను ఎపి లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇకపై ఎల్లుండి (బుధవారం) నుండి పాక్షికంగా పగటి పూట కర్ఫ్యూ కూడా కొనసాగనుంది. కోవిడ్‌ నియంత్రణపై సిఎం జగన్‌ మంత్రులు, సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్‌ నిర్ణయించారని తెలిపారు. ఎపి లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు కానుంది. రెండు వారాల పాటు ఎపి లో ఈ కర్ఫ్యూ కొనసాగనుంది.