ఎఫ్‌ – 3 కోసం రామ్‌చరణ్‌ పోస్ట్‌పోన్‌ !

 రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన ‘ఆచార్య’ మూవీ కూడా హిట్‌ కొడుతుందని ఆశిస్తే.. ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. దీంతో రామ్‌చరణ్‌ భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌ చాలా డిసప్పాయింట్‌ అయ్యారు. అందుకే మెగాఫ్యాన్స్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్ర అప్‌డేట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఇప్పటికే డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రెడీ చేశారని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ చేయడం ఆలస్యమైంది. అయితే ఫస్ట్‌లుక్‌ విడుదల చేయకపోవడానికి కారణం నిర్మాత దిల్‌రాజు అందుబాటులో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. వరుణ్‌తేజ్‌ – వెంకటేష్‌ హీరోలుగా నటించిన ఎఫ్‌ -3 మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.