శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్ వేశారు. ఆమెతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గంప గోవర్ధన్, సురేందర్ తదితరులు ఉన్నారు. కాగా, టీఆర్‌ఎస్ నుంచి పలువురు ఆశావాహులు టికెట్ ఆశించినప్పటికి పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్సీ అభ్యర్థి గా కవిత నామినేషన్