నంబర్–1 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంటర్నల్ సర్వేల్లో వచ్చిన రిపోర్టులు తేల్చిన సత్యమిది… పని చేస్తుంటే ప్రశంసలు అవే వస్తుంటాయి.. ఆయన పని తీరు బాగుంది.. ఆ శాఖ ఉద్యోగులతోనూ మంచిగా పనిచేయించడం ద్వారానే ఇది సాధ్యమైంది.. అందుకే మంత్రి దయాకర్‌రావు, ఆయన సిబ్బందిని అభినందిస్తున్నా..’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో శుక్రవారం ప్రశంసల వర్షం కురింపించారు.అసెంబ్లీలో పల్లె ప్రగతిపై శుక్రవారం జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ మధ్య చేసిన తమ ఇంటర్నల్ సర్వే టాప్ ఫర్‌ఫార్మర్‌గా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవార్డు వచ్చిందని తెలిపారు.మంత్రిని తాను కావాలని పొగడడం లేదని.. పనిచేస్తుంటే ఇలాంటి అవార్డులు, రివార్డులు అభినందనలు వాటంతట అవే వస్తుంటాయని సీఎం కేసీఆర్ అన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు పై ప్రశంసలు కురిపించిన కేసీఆర్