రాజధానిపై వివరణ ఇచ్చినందుకుగాను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై జోక్యం చేసుకోమని కేంద్రం వెల్లడించినా.. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని విమర్శించారు.రాజధానిపై కేంద్ర జోక్యం చేసుకోదని పార్లమెంట్లో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. పచ్చ మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్పై దుష్ర్పచారానికి ఒడిగట్టడం దారుణం అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఎల్లో మీడియా పై ఫైర్ అయిన విజయసాయి రెడ్డి