‘ఎస్పీ’ పద్మవిభూషణ్‌ అవార్డును స్వీకరించిన తనయుడు

 సినిమా రంగంలో విశేష సేవలందించిన వారికి పద్మ అవార్డులు మంగళవారం కూడా రాజ్‌ భవన్‌ లో ప్రదానం చేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్‌ అవార్డు వరించిన విషయం విదితమే. ఎస్పీ తరుపున ఆయన కుమారుడు చరణ్‌ మంగళవారం ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. వీరితో పాటు గాయని చిత్ర కూడా పద్మభూషణ్‌ అందుకున్నారు. ఏక్తా కపూర్‌, కరణ్‌ జోహార్‌, అద్నాన్‌ సమీ, కంగనా రనౌత్‌ సోమవారమే పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.