ఏపీపీ ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి సుచరిత
ఏపీపీ ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి సుచరిత

ఏపీపీ ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలను హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 మందిని ఏపీపీ పోస్టులకు రిక్రూట్ చేశామన్నారు. మొత్తం 2,500 మంది దరఖాస్తు చేశారన్నారు. మహిళలు కూడా 50 శాతం పైబడి ఏపీపీలుగా ఎంపిక అయ్యారన్నారు. ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నియామకాలను పూర్తి చేసిందన్నారు.ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారన్నారు.