ఏపీలో ఆగస్ట్‌ 3న పాఠశాలలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్ట్‌ 3న రాష్ట్రంలోని పాఠశాలన్నీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా పాఠశాలల అభివృద్ధిపై సీఎం ఆరా తీశారు. జులై నెలా ఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడ-–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.ప్రతి పాఠశాలలో 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామని తెలిపారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా ఆయా జాల్లా కలెక్టర్లు పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి సూచించారు.