ఏపీలో ‘ఆచార్య’ టికెట్‌ ధర అదనంగా రూ.50 పెంపు

ఈ ఏడాది నూతన సంవత్సరం రోజున (జనవరి-1)న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన ఓ సభలో ఏపీ సిఎం వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్‌ ధరల్ని నిర్ణయిస్తే.. దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? వారి గురించి పట్టించుకునేవాళ్లేనా? పేదవారికి వీళ్లు శత్రువులు కాదా?’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సిఎం జగన్‌.. కేవలం మూడు నెలల్లోనే సినిమా టికెట్‌ ధరల్ని భారీగా పెంచేశారు. మార్చి 7న తెచ్చిన జీవో ప్రకారం.. పేదలకు సినిమా అందుబాటులో ఉంచేందుకు ప్రతి థియేటర్‌లోను కనీసం 25 శాతం సీట్లు నాన్‌ ప్రీమియం కేటగిరికి కేటాయించాలని ప్రభుత్వం చెప్పింది.