ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 31, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.

ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు