ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు

ఆంద్రప్రదేశ్‌లో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 432కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో.. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైందని తెలిపారు.