ఏపీలో కొత్తగా 186 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 186 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,477 మందికి పరీక్షలు నిర్వహించగా 186 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యారు. ఇద్దరు బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం కోవిడ్‌ బాధిత మరణాల సంఖ్య 82కి చేరింది. తాజా గణాంకాలతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4588కి పెరిగింది. శనివారం ఒక్కరోజు వైరస్‌ నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 2,641కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో1865 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు