ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు
ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 813కు చేరింది. వీరిలో చికిత్స అనంతరం 120 మంది డిశ్చార్జ్‌ కాగా, మొత్తంగా 24 మంది మరణించారు. ఇక కరోనా బారిన పడి ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీ వివరాల ప్రకారం గత 24 గంటల్లో చిత్తూరులో 6, గుంటూరులో 19, కడపలో 5, క్రిష్ణాలో 3, కర్నూలులో 19, ప్రకాశంలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.